విడిచిన కలలు - PART 37
పవన్ ఫోన్‌లో వచ్చిన మెసేజ్ చూసి కాస్త ఆశ్చర్యపోయినా, అది తన స్కూల్ మేట్ నుండి వచ్చిన కాల్ అని తెలిసి రిలాక్స్ అయ్యాడు. మరుసటి రోజు ఉదయం వాళ్లిద్దరూ కలిసి కాసేపు కాఫీ షాప్‌లో గడిపి, పాత రోజుల గురించి సరదాగా మాట్లాడుకున్నారు.
ఆ తర్వాత పవన్ నిత్యను తీసుకుని ఆఫీస్‌కి వెళ్లాడు. ఆఫీస్‌లో కాలేజీస్ అందరూ, "అరే, కొత్త ఇంటికి పార్టీ ఎప్పుడు?" అని ఆటపట్టించారు. నిత్య నవ్వుతూ, "పదండి, ఇప్పుడే వెళ్దాం! లంచ్‌కి మనమంతా కలిసి ఎంజాయ్ చేద్దాం!" అంది. అందరూ సరదాగా ఒక రెస్టారెంట్‌కి వెళ్లి, మాటల్లో, నవ్వుల్లో టైం గడిపేశారు. ఆ తర్వాత పవన్, నిత్య ఇంటికి చేరుకున్నారు.
రాత్రి ఇద్దరూ సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ, నిత్య అంది, "పవన్, మనం తొందర్లోనే పెళ్లి చేసుకుందాం. ఇక ఆలస్యం ఎందుకు?" పవన్ ఆమె చేయి పట్టుకుని, "అబ్బో, నీ మనసులో ఉన్నది చెప్పేశావ్! నాకూ అదే ఆలోచన. త్వరలోనే పెళ్లి ప్లాన్ చేద్దాం!" అన్నాడు. ఇద్దరూ భవిష్యత్తు గురించి కాసేపు కలలు కని, సంతోషంగా నిద్రపోయారు.
మరుసటి రోజు ఉదయం పవన్ లేచి, పక్కన నిత్య కనిపించకపోయేసరికి, "ఓయ్, పెళ్లాం నిత్య! ఎక్కడున్నావ్? కాఫీ తీసుకురా!" అని గట్టిగా అరిచాడు. అంతలోనే నిత్య, లేచి రెడీ అయి, పూజ చేసి, చేతిలో రెండు కాఫీ మగ్‌లతో పవన్ దగ్గరికి వచ్చింది. పవన్ ఆశ్చర్యంగా, "బంగారం, నీవేనా ఇదంతా? ఎప్పుడు లేచావ్?" అన్నాడు. నిత్య నవ్వుతూ కాఫీ ఇచ్చింది. పవన్ కాసేపు ఆటపట్టిస్తూ, "నాకు చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉంది. పెళ్లాంతో పనులు చేయించుకోవాలని. ఈ రోజుతో అది నెరవేరింది!" అన్నాడు.
నిత్య కొంటెగా, "అయితే, నీకు ఇంకో కల ఉంది కదా? మర్చిపోయావా? నీ హీరో పవన్ కళ్యాణ్‌తో ఫోటో దిగాలని!" అంది. పవన్ ఒక్కసారిగా ఉత్సాహంగా, "అబ్బా, అదెలా మర్చిపోతాను బంగారం? అది నెరవేరితే నా లైఫ్ ఫుల్‌ఫిల్ అయినట్టే!" అన్నాడు. నిత్య నవ్వుతూ, "కచ్చితంగా, నీ కోరిక నేను తీరుస్తాను!" అంది. ఇద్దరూ రెడీ అయి, సరదాగా మాట్లాడుకుంటూ ఆఫీస్‌కి బయల్దేరారు.
అయితే, ఆఫీస్‌కి వెళ్లే దారిలో నిత్య ఫోన్‌కి ఒక కాల్ వచ్చింది. అది మేఘ నుండి. "నిత్య, నీకు ఒక సర్‌ప్రైజ్ ఉంది. నీవు, పవన్ ఈ సాయంత్రం మా ఇంటికి రావాలి!" అంది మేఘ ఉత్సాహంగా. నిత్య, పవన్‌ని చూస్తూ, "ఏంటో ఈ సర్‌ప్రైజ్?" అని ఆలోచనలో పడింది...
తర్వాత భాగంలో కొనసాగించబడుతుంది...
No comments:
Post a Comment