విడిచిన కలలు - PART 42
నిత్య మరియు పవన్ హనీమూన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, వారి జీవితం సంతోషంతో నిండిపోయింది. హైదరాబాద్‌లోని వారి కొత్త ఇంట్లో రోజూ కొత్త జ్ఞాపకాలు సృష్టిస్తూ, ఇద్దరూ ఒకరినొకరు మరింత దగ్గరవుతున్నారు. ఉదయం ఇద్దరూ కలిసి టిఫిన్ చేసి, ఆఫీస్‌కి బయలుదేరతారు. ఆఫీస్‌లో నిత్య ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ నామినేషన్ గురించి బిజీగా ఉంటుంది, అటు పవన్ కూడా తన రెవెన్యూ ఆఫీస్ జాబ్‌లో ప్రమోషన్ కోసం కష్టపడతాడు.
ఒక రోజు సాయంత్రం, ఇంటికి వచ్చిన తర్వాత నిత్య కిచెన్‌లో డిన్నర్‌కి సమోసాలు తయారు చేస్తూ ఉంటుంది. పవన్ లివింగ్ రూమ్‌లో సోఫాలో కూర్చొని, టీవీలో పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ చూస్తూ ఉంటాడు. అంతలో నిత్య ఫోన్‌కి కాల్ వస్తుంది—ఆమె అమ్మ నుండి.
Nithya Mother: "నిత్య, ఎలా ఉన్నావ్? హనీమూన్ ఎలా జరిగింది? అసలు, ఇప్పుడు మీరు గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారు మరి?" (నవ్వుతూ)
Nithya: (సిగ్గుపడుతూ) "అమ్మా! ఇప్పుడే ఎందుకు ఆ టాపిక్? మేము ఇప్పుడు సెటిల్ అవుతున్నాం. ఆఫీస్, ఇల్లు, అన్నీ చూసుకుంటూ బిజీగా ఉన్నాం. ఆ గుడ్ న్యూస్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు." (నవ్వుతూ)
Nithya Mother: "సరే సరే, నీ ఇష్టం. కానీ, నీవు సంతోషంగా ఉంటే చాలు. ఎప్పుడైనా మా ఊరికి రండి, అమ్మమ్మ కోసం కొత్త స్వీట్ రెసిపీ నేర్చుకున్నాను, చేసి పెడతాను."
కాల్ ముగిసిన తర్వాత, నిత్య కిచెన్ నుండి సమోసాల ప్లేట్ తీసుకొని పవన్ పక్కన కూర్చుంటుంది.
Nithya: (చిన్నగా నవ్వుతూ) "పవన్, అమ్మ ఇప్పుడు కాల్ చేసి గుడ్ న్యూస్ గురించి అడిగింది. నీవు ఏమంటావ్?"
Pawan: (ఆశ్చర్యంగా, చిలిపిగా) "అరె, అమ్మగారు ఇప్పుడే స్పీడ్ పెంచేశారా? నిత్య, నీవు ఏం చెప్పావు?"
Nithya: (సమోసా తింటూ) "ఏం చెప్పను, ఇప్పుడే మనం సెటిల్ అవుతున్నామని చెప్పాను. కానీ, నీవు ఏమంటావ్? మనం ఈ టాపిక్ గురించి ఆలోచించాలా?"
Pawan: (నిత్య చేయి పట్టుకొని) "బంగారం, నీవు సం� ready అయినప్పుడు నేను ఎప్పుడూ ready. కానీ, నీవు సింగపూర్ ప్రాజెక్ట్‌లో బిజీ అవుతావు కదా? అది అయ్యాక, మనం కలిసి మన ఫ్యూచర్ ప్లాన్ చేద్దాం. ఏంటి, ఒక బేబీ పవన్ కళ్యాణ్‌ని తయారు చేద్దామా?" (కన్ను కొడతాడు)
నిత్య సిగ్గుపడుతూ, పవన్‌ని సమోసాతో నోట్లో కొడుతూ, "అబ్బ, నీ చిలిపి మాటలు ఆపు!" అంటూ నవ్వుతుంది. ఇద్దరూ ఆ రాత్రి టీవీ చూస్తూ, సమోసాలు తిని, ఒకరినొకరు ఆటపట్టిస్తూ సంతోషంగా గడుపుతారు.
మరుసటి రోజు, ఆఫీస్‌లో నిత్యకి సింగపూర్ ప్రాజెక్ట్ కోసం ఫైనల్ కాల్ వస్తుంది. ఆమె సెలెక్ట్ అయినట్లు కన్ఫర్మ్ అవుతుంది! నిత్య వెంటనే పవన్‌కి కాల్ చేసి ఈ విషయం చెప్పగానే, పవన్ ఆనందంతో గంతులేస్తాడు.
Pawan : "వావ్, నిత్య! నీవు సెలెక్ట్ అయ్యావా? ఇది సెలబ్రేషన్ చేయాలి! ఈ వీకెండ్ మనం మేఘ, సాయి, చింటూలను కలుద్దాం. ఒక చిన్న గెట్-టుగెదర్ ప్లాన్ చేద్దాం."
Nithya: "సూపర్ ఐడియా! కానీ, మేఘకి కాల్ చేసి చెప్పాలి. ఆమె ఈ సారి సర్‌ప్రైజ్‌గా ఏదైనా ప్లాన్ చేస్తుందేమో!" (నవ్వుతూ)
ఆ రాత్రి, నిత్య మేఘకి కాల్ చేసి సింగపూర్ ప్రాజెక్ట్ విషయం చెప్పగానే, మేఘ ఎగ్జైట్ అవుతుంది. "నిత్య, ఇది అద్భుతం! నీవు సింగపూర్ వెళ్తున్నావని తెలిస్తే, నా ఫ్రెండ్ ఒకరు అక్కడ ఉన్నారు, వాళ్ళు నీకు సిటీ టూర్ ప్లాన్ చేస్తారు!" అంటూ మేఘ సంతోషంగా చెప్పింది.
ఇంతలో, పవన్ నిత్యకి ఒక ఐడియా చెప్పాడు. "నిత్య, సింగపూర్ ట్రిప్ అయ్యాక, మనం మన ఊరికి వెళ్దామా? నీ అమ్మ, నాన్న, నా తల్లిదండ్రులను కలిసి, వాళ్ళతో కొంత సమయం గడిపితే బాగుంటుంది. ఏంటి, నీకు ఒకేనా?"
నిత్య ఆలోచిస్తూ, "సరే, పవన్. కానీ, వాళ్ళు మళ్లీ గుడ్ న్యూస్ గురించి అడిగితే, నీవే సమాధానం చెప్పాలి!" అంటూ చిలిపిగా నవ్వింది.
TO BE CONTINUE IN PART 43......... STAY TUNE
No comments:
Post a Comment